హైదరాబాద్ శివారు కీసరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.1.5 కోట్లతో చేపట్టిన గోదాంను మంత్రి మల్లారెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, ఈ బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశం వెనకబడితే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇంకా దివాళా తీసిందన్నారు. దేశ ప్రజలంతా నెక్స్ట్ పీఎం కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. వరుణదేవుడు కాంగ్రెస్, బీజేపీతో కలిసి రైతులను ఆగం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. అనంతరం.. మణిపూర్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకోవడంతో వారికి స్వాగతం పలికారు మంత్రి మల్లారెడ్డి.
Also Read : Rana Daggubati: అందుకే నేను లావు అయ్యాను.. ప్రెగ్నెన్సీపై రానా భార్య క్లారిటీ
మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం ఉదయం మణిపూర్ రాజధాని ఇంఫాల్ మీదుగా బయలు దేరిన విమానం మధ్యాహం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తెలంగాణ భవన్ అధికారులు మొదటి విడతగా 106 మంది విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకువచ్చింది. దీంతో పాటుగా ఏపీకి చెందిన 108మంది విద్యార్థులకు కూడా మరో విమానంలో శంషాబాద్‌కు చేరుకున్నారు.
Also Read : Madhave Madhusudana: ‘సైయారా.. సైయారా…’ సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం!