Rana Daggubati: భల్లాల దేవా రానా దగ్గుబాటి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో ముందుకొచ్చిన రానా .. ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు. ఇక ఇంకోపక్క నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానాను.. బిజినెస్ విమెన్ మిహీక బజాజ్ తన ప్రేమలో పడేసి.. భర్తగా చేసేసుకోంది. కరోనా సమయంలో ఈ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి అయిన ఏడాది నుంచి రానా తండ్రి కాబోతున్నాడు అన్న వార్తలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడు ఆ వార్తలు నిజమే అనుకోని అభిమానులు ఆనందపడడం, అందులో నిజం లేదని నిరాశ పడడం అలవాటుగా మారిపోయింది. ఇక మొన్నటికి మొన్న మిహీక.. ఒక వెకేషన్ లో ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె కొంచెం బొద్దుగా కనిపించడంతో.. మరోసారి ఆమె ప్రెగ్నెంట్ అని, రానా తండ్రి కాబోతున్నాడు అని చెప్పుకొచ్చేశారు.
Madhave Madhusudana: ‘సైయారా.. సైయారా…’ సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం!
ఇక తాజాగా ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై మిహీక స్పందించింది. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ఆమె ఈ రూమర్స్ ను ఖండించింది. ” నేను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. రానాతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే నేను ఈ మధ్య బరువు పెరిగాను. అందుకే అందరూ గర్భవతి అని అనుకుంటున్నారు. కానీ, అదేమీ కాదు. నేను ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి రానా అభిమానులకు నిరాశే మిగిలింది. త్వరలోనే రానా దంపతులు శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.