తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి పక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. బోర్ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. అభివృద్ది చేసే వాడు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి?.. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 కు పెరిగింది అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లో అభివృద్ది ఇప్పటి దాకా చేసింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read Also: Firecrackers on Bike: బైక్‌పై టపాసులు కాల్చుడేంటి..? ఆ స్టంట్స్ ఏంటి..? దూలతీరిందా..?
వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 332 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తాం.. ఓఆర్ఆర్, త్రిపుల్ ఆర్ మధ్యలో కొత్త హైదారాబాద్ నిర్మాణం చేసి చూపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. త్రిపుల్ ఆర్ బయట కూడా కొత్త రింగ్ రోడ్డు.. తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గం సులభం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం.. అభివృద్ది, రాష్ట్ర ప్రగతి కొనసాగాలంటే కేసిఆర్ మళ్ళీ రావాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు.