KTR: మంచి పనితీరు కనబర్చినవారికే ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సీఎం అంటున్నారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని కేటీఆర్‌అన్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.