Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana Assembly Elections 2023 Minister Ktr Fires On Bjp And Congress 2

Minister KTR: బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరు.. మాది సెక్యులర్ పార్టీ

Published Date :November 8, 2023 , 7:58 pm
By Mahesh Jakki
Minister KTR: బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరు.. మాది సెక్యులర్ పార్టీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister KTR: సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకిందని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కరెంట్ ఇవ్వకపోతే రైతులు సబ్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మనకి కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అంటే దొంగరాత్రి కరెంట్ అంటూ ఆయన మండిపడ్డారు.

Also Read: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌కళ్యాణ్

కాంగ్రెస్ వాళ్లు ఒక్క చాన్స్ అంటూ బతిలాడుతున్నారని.. 11 సార్లు ఇస్తే ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి బీజేపీకి కేసీఆర్ బీ టీం అంటారని.. బెంగాల్ పోయి దీదీ బీజేపీకి బీ టీం అంటారని.. ఢిల్లీకిపోయి కేజ్రీవాల్‌ని బీజేపీకి బీ టీం అంటారని కేటీఆర్ చెప్పారు. బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరని.. మాది సెక్యులర్ పార్టీ అని మంత్రి తెలిపారు. మేము బీజేపీకి బీ టీం అయితే మైనారిటీల కోసం ఎందుకు సంక్షేమ పథకాలు పెడుతామని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. ప్రధాని మోడీ వచ్చి కాంగ్రెస్‌తో కేసీఆర్ కలిశారు అని చెబుతారని.. రాహుల్ గాంధీ వచ్చి బీజేపీతో కేసీఆర్ తో కలిశారు అని చెబుతారని ఆయన పేర్కొన్నారు. కవితని అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటారని ఆయన ఎద్దేవా చేశారు. మరి సోనియా, రాహుల్ గాంధీలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

Also Read: PM Modi: ఈ నెల 11 న రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ

జగ్గారెడ్డి తాను కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తా అని ప్రచారం చేస్తున్నాడట.. అలా చేస్తే చింతా ప్రభాకర్ గెలుపు కోసం తాను ఎందుకు వస్తా అని ఆయన అన్నారు. సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి చెప్పాడని.. డీకే శివకుమార్ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నాడని.. రేవంత్‌కి కరెంట్ కనపడటం లేదట మాకు సవాల్ విసిరారని కేటీఆర్‌ చెప్పారు. రేవంత్, జగ్గారెడ్డికి రెండు బస్సులు పెడుతా, దమ్ బిర్యానీ పెడుతా తిని వెళ్లి కరెంట్ తీగలు పట్టుకుని చూడండంటూ కేటీఆర్‌ సవాల్ విసిరారు. కరెంట్ ఉంటే మీరే పోతారు…పీడ పోతదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. బక్క పలుచటి కేసీఆర్‌ని ఎదుర్కోవడానికి షేర్లు, బబ్బర్ షేర్లు, తీస్ మార్ ఖాన్‌లు వస్తున్నారని.. ఎంత మంది వచ్చినా సరే సింహం సింహం సింగిల్‌గా వస్తుందన్నారు మంత్రి కేటీఆర్.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BRS Party
  • congress
  • Minister KTR
  • Telangana Assembly Elections

తాజావార్తలు

  • RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..

  • LG QNED Evo TV: 4K క్వాలిటీ, 330Hz గేమింగ్, AI ఫీచర్లతో.. ఎల్జీ 115 అంగుళాల స్మార్ట్ టీవీల ఆవిష్కరణ

  • CM Revanth Reddy : యువత బాట.. ఆటపాట.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’

  • Hyundai Car Discounts: భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హ్యూందాయ్.. ఏకంగా రూ.1.10 లక్షలు..

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions