KTR: ఆయనది ఐరన్ లెగ్..అప్పుడు టీడీపీ..ఇప్పుడు కాంగ్రెస్ వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక నాయకులు కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50 ఏళ్ళు పాలించారని.. రైతుబంధు, రైతబీమా వంటి ఆలోచన ఎవరకీ రాలేదని.. ఒక్క కేసీఆర్ మదిలోంచి వచ్చాయని అన్నారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వంపై కొంతమంది బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయని వారు మళ్ళీ వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. 14 ఏండ్లు పోరాటం చేస్తే ఎంతోమంది బలిదానాలు చేస్తే గత్యంతరం లేక కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
రూ.200 పింఛన్ రూ.2000అయ్యింది త్వరలో కొత్త పింఛన్లు మేమే ఇస్తామని అన్నారు. ఇంటింటికి నీరు, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయాలు అందిస్తున్న ఘనత మాదే అని కేటీఆర్ అన్నారు. పక్కన ఉన్న రాష్ట్రం బీజేపీ దద్దమ్మ పాలన ఉందని అక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయా.? అని ప్రశ్నించారు. మాటల మనుషులు కావాలా చేతల మనుషులు కావాలా,ఐరెన్ లెగ్ కావాలా గోల్డెన్ లెగ్ కావాలా అని ప్రజలను అడిగారు. పెద్దోలను తిడితే పెద్దమనుషులం కామని.. పని చేసి పెద్ద మనుషులం కావాలని అన్నారు.
Also Read
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Cab Driver Rajasekhar : క్యాబ్ కోసం పక్కా స్కెచ్.. డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్.!
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
ఒకడేమో కుల పిచ్చితో ఉన్నాడని.. మరొకరు మత పిచ్చితో ఉన్నారు జాగ్రత్త అని అన్నారు. మసీదులు తవ్వాలని ఒకడు అంటున్నాడని..స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు అయింది అయినా వీరు మారరని విమర్శించారు. అప్పర్ తుంగభద్రకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్ట్ కు మోదీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని ప్రశ్నించారు. జన్ ధన్ తెరవండి ధన్ ధన్ డబ్బులు ఇస్తా అన్నాడు, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ నల్లధనం అని కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పుడు రూ. 400 సిలిండర్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని దద్దమ్మ అన్నారు.. ఇప్పుడు రూ.1000 అయ్యింది ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. సర్పంచులకు రావాల్సిన డబ్బులు రూ.1400కోట్లు కేంద్రం అడ్డుకుంది అవి వచ్చిన తర్వాత అందిస్తాం అని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు నీతి జాతి లేని పార్టీలను బండకేసి కొడుదాం అని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!