ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్’ ( Hon Hai Fox Conn) సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ ( Young Liu) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు ఐ అంటే ఇండియా… టి అంటే తైవాన్ అని అన్నారు.
Also Read : Putin: పుతిన్ వైభోగం మామూలుగా లేదుగా.. రూ.990 కోట్ల ఎస్టేట్‌లో లవర్‌తో రహస్య జీవనం
సాఫ్ట్వేర్ కు ఇండియా పవర్ హౌస్ అని మరో పక్క తైవాన్ దేశం హార్డ్వేర్ లో సంచలనాలు సృష్టిస్తుందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అని ఆయన అన్నారు. టీ వర్క్స్ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లియూతో పాటు ఆయన బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో ఈ ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో పెట్టుబడులు తెలంగాణకు తరలిరాగా, తాజాగా ఫాక్స్ కాన్ పెట్టుబడులు పెట్టడం, లక్ష మందికి ఉద్యోగ కల్పన చేస్తామని ప్రకటించినందుకు యంగ్ లియూకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.
Also Read : Deepthi Sunaina: చిన్ని నిక్కర్ లో షన్ను మాజీ గర్ల్ ఫ్రెండ్ సెగలు పుట్టిస్తోందే