ఉప్పల్-నారపల్లి నిలిచిపోయిన నూతన ఫ్లై ఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమై నేటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తికాలేదు. ఐదేళ్ళైనా ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడం కారణాలపై నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు.