పొగాకు రైతులు ధరలపై అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటికే పొగాకు ధరలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారన్నారు. రైతులు దగ్గర ఉన్న పొగాకు పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి కొనే విదంగా చూస్తామన్నారు. బాపట్ల జిల్లా టూరిజంకి ఆయువు పట్టు అని, టూరిజంతో జిల్లా జీడీపీ పెరుగుగుతుందన్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తున్నాం అని మంత్రి చెప్పుకొచ్చారు. నేడు బాపట్ల జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు.
Also Read: Bala Veeranjaneya Swamy: ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం.. ఎలాంటి బదిలీలు ఉండవు!
‘బాపట్ల జిల్లాలో బ్లాక్ బేరి పొగాకు పంటను ఈసారి అత్యధికంగా సాగు చేశారు. పొగాకు పంటకు తగిన గిట్టుబాటు ధరలు కంపెనీలు కల్పించడం లేదని తెలిసింది. DRCలో పొగాకు పంట ధరలపై చర్చించాం. రైతులు దగ్గర ఉన్న పొగాకు పంటను కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి కొన్నేవిదంగా చూస్తాం. ఇప్పటికే పొగాకు ధరలపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. పొగాకు రైతులు ధరలపై అధైర్యపడొద్దు. బాపట్ల జిల్లా టూరిజంకి ఆయువు పట్టు, టూరిజంతో జిల్లా జీడీపీ పెరుగుగుతుంది. సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 97 కోట్లను మంజూరు చేసింది. సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభం చేస్తాం. APSIDC పథకం కింద లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రణాళికలు రూపొందించాం. రైతుల నుండి సేకరించిన వరి ధాన్యంకు 24 గంటల్లో నగదు చెల్లిస్తున్నాం. త్వరలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తున్నాం’ అని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.