Karumuri Nageswara Rao: అవినీతపరుడైన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతోనే చంద్రబాబు జనంలో తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తూ.. రైతులతో మాట్లాడుతోన్న చంద్రబాబుపై మండిపడ్డ ఆయన.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు చంద్రబాబు రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా వైసీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశారు.. రైతురుణ మాఫీ చేస్తాం అని అధికారంలోకి వచ్చాక 85 వేల కోట్లు నుంచి 18వేల కోట్లకు కుదించారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. కానీ, చివరికి అది కూడా ఇవ్వకుండా వదిలేశారని విమర్శించారు..
Read Also: Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో అక్రమాలు..! శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
అమరావతి అవినీతిపై స్టే ఎత్తేయడం, స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసుల్లో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇప్పుడు చంద్రబాబు జనంలో తిరుగుతున్నారు.. అవినీతపరుడైన చంద్రబాబుని అరెస్ట్ చేస్తారంటూ జోస్యం చెప్పారు కారుమూరి.. అమరావతి పేరుతో దోచుకున్నదంతా బయట పడుతుందనే భయంతో జనంలో తిరుగుతున్నారన్న ఆయన.. మరోవైపు.. రైతుల పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలకు కోట్లు దోచి పెట్టారని ఆరోపించారు. కాగా, చంద్రబాబు హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతిపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై హైకోర్టు స్టే విధించడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కార్.. అయితే, హైకోర్టు స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం విదితమే. దీంతో.. ఏపీ సర్కార్ వేసిన సిట్ యథావిథిగా పనిచేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.