అభివృద్ధి కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మంతి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరగలేదన్నారు.
ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వంద కోట్ల బడ్జెట్ క్రీడలకు కేటాయించారన్నారు. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు.