Minister Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో ఒక్క దానికేనా సీబీఐ విచారణకు సిద్ధం అని ప్రకటించగలరా? 24 గంటల్లో స్పందించాలని చంద్రబాబుకు సవాలు విసురుతున్నా అన్నారు. ఈ రోజు సచివాయలంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ ల చోరీ కేసులో సీబీఐ నాకు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు. సీబీఐ విచారణకు సిద్ధమని ఏపీ హై కోర్టుకు కూడా నేను తెలియచేశా.. అసలు గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదని సీబీఐ తన చార్జిషీట్ లో స్పష్టంగా చెప్పిందన్నారు. సీబీఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు.. టీడీపీ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని సీబీఐ చెప్పిందన్నారు.
Read Also: Mrunal Thakur: నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్ తప్పేం లేదు.. మృణాల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
ఇక, వైఎస్ అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థ అయినప్పుడు నా కేసులో అది ఉన్నత దర్యాప్తు సంస్థ ఎందుకు కాకుండా పోయింది? అని ప్రశ్నించారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. చంద్రబాబు తనపై ఉన్న కేసులలో ఒక్క దానికేనా సీబీఐ విచారణకు సిద్ధం అని ప్రకటించగలరా? 24 గంటల్లో స్పందించాలని చంద్రబాబుకు సవాలు విసిరారు.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగాఉంది.. కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏదైనా కొత్త పార్టీ వస్తే కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం విఫలం అయితే ఆయనకు ఇతర పార్టీలతో పొత్తులు ఎందుకు? అని ప్రశ్నించారుజ చంద్రబాబు మోసం చేస్తారని ప్రజలకు కూడా అర్ధం అయ్యిందని పేర్కొన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.