Mrunal Thakur Comments on nepotism: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. తాజాగా ఆమె నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ స్టార్ కిడ్స్ మీద నెపోటిజం విషయంలో నిందలు వేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చింది. తమ అభిప్రాయం ప్రకారం సాధారణ ప్రజలమైన మనం అలాగే మీడియా స్టార్ కిడ్స్ కి ఇస్తున్న అటెన్షన్ దానికి కారణమని చెప్పుకొచ్చింది.
Ari Movie: రిలీజ్ కి ముందే అనసూయ సినిమా రీమేక్ పై స్టార్ హీరోల ఫోకస్?
ఒకరోజు అవార్డ్స్ ఫంక్షన్లో నేను ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఎవరో ఒక స్టార్ కి వచ్చారని, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు పరిగెత్తారు. కేవలం వాళ్ళు వస్తున్నారనే విజువల్స్ షూట్ చేయడం కోసం నా ఇంటర్వ్యూ సైతం వాళ్లు మధ్యలో వదిలేసి పరిగెత్తారు. కాబట్టి నెపోటిజం విషయంలో స్టార్ కిడ్స్ మీద నిందలు మనం వేయకూడదు, అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు స్టార్ కిడ్స్ కాబట్టి వాళ్ల గురించి ఏదో తెలుసుకోవాలని సాధారణ ప్రేక్షకులు భావిస్తూ ఉండడమే దానికి కారణం. అలాగే మీడియా సాధారణ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తోంది. అని అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి మృణాల్ ఠాకూర్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ రోజు సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.