Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- షేక్ హసీనాను పట్టుకొచ్చి ఉరితీస్తాం..
- మాజీ ప్రధానిపై బంగ్లాదేశ్ కఠిన వైఖరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina Extradition: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో మరోసారి ఆ దేశం కఠిన వ్యాఖ్యలు చేసింది. 2024 ఆగస్టులో హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ పారిపోయి వచ్చి, ఇక్కడే నివసిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగి వస్తానని చెప్పింది. అయితే, ఈ విద్యార్థి ఉద్యమంలో మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె అధికారాన్ని ఉపయోగించిందని అక్కడి కోర్టులు హసీనాను దోషిగా తేల్చాయి. ఆమెకు మరణశిక్షను ఖరారు చేశాయి.
ఈ నేపథ్యంలో భారత్ తమకు షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. తాజాగా, బంగ్లా ప్రధాని తారిఖ్ రెహమాన్ సమాచార సలహాదారుడు జహీద్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. హసీనాను భారత్ నుంచి తీసుకువచ్చి, బంగ్లాదేశ్‌లో విధించిన మరణశిక్షను అమలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ఢాకాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హసీనా స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ తిరిగి వచ్చే వరకు ఎదురు చూడకూడదని, చట్టపరమైన ప్రక్రియ ద్వారా ఆమెను భారత్ నుంచి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. హసీనాను అప్పగించాలనే డిమాండ్‌ను కేవలం భారత్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహాంగా ఉపయోగించడం లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
హసీనా దేశానికి తిరిగి వచ్చిన వెంటనే మరణశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని జహీద్ అన్నారు. మరోవైపు, భారత్‌లో ఉంటూ హసీనా మీడియా సమావేశాలు నిర్వహించడాన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆమెను అప్పగించే వరకు ఇలాంటి కార్యక్రమాలు అడ్డుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సాధారణ సంబంధాలు మెరుగవుతాయని బంగ్లా చెబుతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!