Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ డైరెక్టర్ ఆదిత్య హాసన్‌కు ఎవరైనా ఎదురొస్తే తాను చూసుకుంటానని, 100% ఎవరినీ అతని జోలికి రానివ్వనని విజయ్ ఓపెన్‌గా భరోసా ఇచ్చారు. ఆదిత్య, నాగి, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారంతా తన మనుషులని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తెలుగు సినిమాకు ఇది అద్భుతమైన సంవత్సరమని, రాబోయే సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అవుతాయని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 11న ఆనంద్ ‘ఎపిక్’, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల ‘పారడైజ్’, రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’, రష్మిక ‘ది మైసా’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’, డిసెంబర్లో ‘ఫౌజీ’, బాలయ్య ‘దాదా’ లాంటి సినిమాలు వరుసగా రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ సినిమాల్లో దాదాపు నాలుగు చిత్రాల కంటెంట్ తనకు తెలుసని, ఇదొక “ఆపరేషన్ TFI” అని, 100% స్ట్రైక్ రేట్‌తో బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టబోతున్నామని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోల అంబిషన్, రైటింగ్ స్కేల్ పెరిగిందని, కానీ టెక్నికల్ టీమ్స్‌లో సరైన సెటప్, ఎఫిషియన్సీ లేకపోవడం వల్లే సినిమాలు డిలే అవుతున్నాయని విజయ్ కుండబద్దలు కొట్టారు. సినిమా పరిశ్రమలో కేవలం 20-30% మాత్రమే స్కిల్డ్ పీపుల్ ఉన్నారని, మిగతా ఇండస్ట్రీ అంతా అన్‌స్కిల్డ్ సెక్టార్‌గా మారిందని ఆయన విమర్శించారు. ఫిల్మ్ స్కూల్స్ నుంచి వచ్చే కొత్త బ్యాచ్‌లతోనే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ఆయన విశ్లేషించారు. ఆనంద్ దేవరకొండతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను విజయ్ ఎమోషనల్‌గా పంచుకున్నారు. పుట్టపర్తిలో తనను ఫస్ట్ టైమ్ హాస్టల్లో వదిలిపెట్టేందుకు వెళ్లినప్పుడు, ఆనంద్ కూడా తనతో పాటే ఉంటానని వెక్కి వెక్కి ఏడ్చాడని గుర్తుచేసుకున్నారు. థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆనంద్ తన క్లాస్రూమ్ డోర్ వెనకాల దాక్కునేవాడని ఆయన తెలిపారు. అమెరికా వెళ్లేటప్పుడు కూడా ఎన్నో భయాలు ఉన్న ఆనంద్, ఇప్పుడు తనకంటూ ఒక సొంత దారిని క్రియేట్ చేసుకున్నాడని విజయ్ గర్వంగా చెప్పారు.
Also Read
హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అని విజయ్ కొనియాడారు. ఒంటరిగా పోరాడి తన కుటుంబ కష్టాలను, వారి కలలను నెరవేర్చి వారి గ్రాఫ్‌ను ఆమె సింగిల్ హ్యాండెడ్‌గా మార్చేసిందని ప్రశంసించారు. ‘అర్జున్ రెడ్డి’ టైంలో తాను సాధించింది చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడమే తన బిగ్గెస్ట్ పర్పస్ అని విజయ్ ముగించారు.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!