సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. జిల్లాలో నూతనంగా ప్రకటించిన తడ్కల్ మండలం కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది అంటూ విమర్శించారు.