Harish Rao: సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి.. రైతు సంక్షేమం విషయంలో రాజీపడబోం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని సీఎం కేసీఆర్ మాఫీ చేసినందుకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా.. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ సర్కార్ ఎక్కడా రాజీపడలేదన్నారు. ఒకే రోజు మొత్తం 9,02,843 మంది రైతుల ఖాతాలకు రూ.5,809.78 కోట్లు బదిలీ చేసినట్లు పేర్కొన్నాడు. అత్యధికంగా ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేసిన రికార్డును తెలంగాణ ప్రభుత్వానికి నెలకొల్పిందన్నారు.
Read Also: Suriya: కుటుంబంతో విడిపోయి ముంబైలో మకాం.. సూర్య ఏమన్నాడంటే.. ?
Also Read
దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్ లో నిలుచునే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోంది అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిరాటంకంగా కొనసాగించారు. ఇప్పుడు అదే రీతిగా రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం అని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా చెప్పారు.
Read Also: Vaishnavi Chaithanya: ‘బేబీ’ బ్యూటీ.. అన్ని ఆ డైరెక్టర్ తోనే.. ?
అయితే, సీఎం కేసీఆర్ లక్ష రూపాయల లోపు రుణమాఫీలను మాఫీ చేసినందుకు తెలంగాణలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఉత్తర్వులతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్ కు రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు.
On the eve of Independence day, Telangana treasury made highest ever payment in the history of state clearing all the farm loans upto Rs99,999. A whooping Rs 5,809.78 crore transferred to 9lakh farmers accounts.
This will be a moment to cherish in the history of Independent… pic.twitter.com/LR1DKNdfX7
— Harish Rao Thanneeru (@BRSHarish) August 14, 2023
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!