Harish Rao: బీజేపీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికతో బీజేపీ, కాంగ్రెస్ స్నేహ బంధం బట్టబయలు అయ్యిందన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు ఇద్దరు ఏ పార్టీలో ఉన్న ఒకరికి ఒకరి గెలుపు కోసం పని చేస్తారని మంత్రి అన్నారు. ఢిల్లీలో రెండు పార్టీల మధ్య స్నేహ బంధం బయటపడిందన్నారు.
Also Read: Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ పిచ్చి తుగ్లక్ డిజైన్.. న్యాయ విచారణకు కేసీఆర్ సిద్ధమా?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పని చేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకుంటున్నారని.. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఎవరిని పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ పార్టీ కేసీఆర్‌ను తట్టుకోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిపిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నీరుగార్చడానికి రెండు పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. రాహుల్ గాంధీ ఉంటే నరేంద్ర మోడీకి బలం అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారన్నారు మంత్రి హరీశ్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు తెలంగాణ శక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే విషం చిమ్మే పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అన్నం పెట్టే నాయకుడు కేసీఆర్.. సున్నం పెట్టే పార్టీ ప్రతిపక్షాలు అంటూ వ్యాఖ్యాంచారు. పొరపాటున కాంగ్రెస్‌కి ఓటేస్తే 60 ఏళ్ల కిందికి తెలంగాణ పోతుందన్నారు. మూడో సారి కేసీఆర్‌ను గెలిపించుకోకపోతే రాష్ట్రం ఆగం అవుతుందన్నారు మంత్రి హరీశ్ రావు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?