Gudivada Amarnath: పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్టు కనిపిస్తోందీ.. స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి కాదు చంద్రబాబుతో ఉన్న లింకులు గురించి పవన్ మాట్లాడితే మంచిది.. ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడింది, డిపాజిట్లు కూడా రాలేదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడానికే పరిమితం అనే పవన్ కళ్యాణ్ తీరును ఖండిస్తున్నాం.. తెలంగాణలో స్థిర నివాసం వుండే మీ బలం ఏంటో తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయింది అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ది ఏ నియోజకవర్గమో చెప్పాలి?.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియని నాన్ రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తి పవన్.. నాయకుడుగా కాదు కథా నాయకుడుగా ఎక్కడ పోటీ చేస్తారో చెప్పాలి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
Read Also: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు
Also Read
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష. ఏమిటీ ఫెన్యా..?
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
- Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
తెలంగాణలో బీజేపీని నాశనం చేశాడు.. ఏపీలో ఏం జరగబోతుందో చూద్ధాం అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకారణపై పవన్ కళ్యాణ్ వి అర్ధం లేని వ్యాఖ్యలు.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైనా చెప్పిందా.. బలహీనతలు బయటపడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. పవన్, చంద్రబాబుకు వంద రోజుల సమయం మాత్రమే ఉంది.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయి.. 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి.. రాజకీయాల మీద బండ్ల గణేష్ కు ఉన్న కమిట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కు లేదు అని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఉద్ధానం సమస్యకు పరిష్కారం చూపించింది వైసీపీ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఉద్దానంలో ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారు.. విశాఖ ఐటీ హిల్స్ లో యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ రాబోతోంది.. ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది.. ఉత్తారంధ్ర అభివృద్ధిని టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష. ఏమిటీ ఫెన్యా..?
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
-
AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!