పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్టు కనిపిస్తోందీ.. స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి కాదు చంద్రబాబుతో ఉన్న లింకులు గురించి పవన్ మాట్లాడితే మంచిది.. ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడింది, డిపాజిట్లు కూడా రాలేదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడానికే పరిమితం అనే పవన్ కళ్యాణ్ తీరును ఖండిస్తున్నాం.. తెలంగాణలో స్థిర నివాసం వుండే మీ బలం ఏంటో తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయింది అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ది ఏ నియోజకవర్గమో చెప్పాలి?.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియని నాన్ రెసిడెంట్ ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తి పవన్.. నాయకుడుగా కాదు కథా నాయకుడుగా ఎక్కడ పోటీ చేస్తారో చెప్పాలి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
Read Also: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు
తెలంగాణలో బీజేపీని నాశనం చేశాడు.. ఏపీలో ఏం జరగబోతుందో చూద్ధాం అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకారణపై పవన్ కళ్యాణ్ వి అర్ధం లేని వ్యాఖ్యలు.. స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైనా చెప్పిందా.. బలహీనతలు బయటపడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు అని ఆయన విమర్శలు గుప్పించారు. పవన్, చంద్రబాబుకు వంద రోజుల సమయం మాత్రమే ఉంది.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయి.. 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి.. రాజకీయాల మీద బండ్ల గణేష్ కు ఉన్న కమిట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కు లేదు అని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఉద్ధానం సమస్యకు పరిష్కారం చూపించింది వైసీపీ ప్రభుత్వం అని ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఉద్దానంలో ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారు.. విశాఖ ఐటీ హిల్స్ లో యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ రాబోతోంది.. ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది.. ఉత్తారంధ్ర అభివృద్ధిని టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.