Dharmana Prasada Rao: మా కార్యకర్తలు ఆర్ధికంగా చెడిపోయారు.. నాలుగు సంవత్సరాలుగా ఖర్చు మాత్రమే పెట్టారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఏ కార్యకర్తకు పైసా లబ్ధిలేదు, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం, మా కార్యకర్తలు పనిచేశారని తెలిపారు.. మా కార్యకర్తలు అందరూ ఆర్ధికంగా పూర్తిగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ కు ఖర్చు ఎవరు పెట్టారు.. మా కార్యకర్తే ఆయన జేబులో డబ్బులే ఖర్చు చేశారని తెలిపారు.. ఎక్కడ నుండో డబ్బులు వచ్చి మీటింగులు పెట్టడం లేదు.. మాకు పైసా ఎక్కడ నుండి రాలేదు.. చేతి చమురే వదులుతోందని వ్యాఖ్యానించారు.
Read Also: Adipurush: తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్.. ఎంత పెంచుకోవచ్చంటే?
అవినీతి లేకుండా ప్రతీ ఒక్క లబ్ధిదారుని ఇంటికే పథకాలు అందుతున్నాయని తెలిపారు మంత్రి ధర్మాన.. మమ్ములను ఎవరూ ప్రశ్నించకుండా ఉండేలా మేం నిజాయితీగా పాలన చేస్తున్నాం అన్నారు.. ఇక, పూర్వం మాదిరి ఎమ్మెల్యే, చైర్మన్, మున్సిపల్ కమీషనర్ కనిపించడం లేదనే మాట ప్రజల నుండి రావడం లేదన్నారు. అధికారులు, నాయకులు నిరంతరం ప్రజలతోనే ఉంటున్నాం.. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నాలుగేళ్లలో మేనిఫెస్టోలో పొందుపర్చిన అన్ని పనులు పూర్తిచేశామన్నారు.. దేశంలో ఇలా మేనిఫెస్టో పూర్తి చేసిన పార్టీ మాదే ఇంకే పార్టీ లేదన్నారు. 75 ఏళ్లుగా ఇలా ప్రభుత్వ నడపడం మనం చూడలేదు.. అవినీతి లేని పాలన ఈ ప్రభుత్వంలోనే ఉందన్నారు.. జన్మభూమి కమిటీ సభ్యులు గతంలో మిమ్ములను ఎలా బెదిరించేవారో తెలియదా..? అని ప్రశ్నించారు.. జన్మభూమి కమిటీ సభ్యులు బ్రోకర్ పనులు మాత్రమే చేసేవారంటూ మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.