Deepti Sunaina Shocking Answer to Fans Indirect Question on Shanmukh Jaswanth: సోషల్ మీడియాలో డబ్స్ మాష్ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించింది దీప్తి సునయన. ఆ తరువాత యూట్యూబ్ లో కొన్ని కవర్ సాంగ్స్ చేస్తూ ఆమె దాన్ని మరింత పెంచుకుంది. ఇక అలా ఆమెకు దక్కిన క్రేజ్ తో బిగ్ బాస్ అవకాశం కూడా తెచ్చుకుని తెలుగు వారికి మరింత దగ్గరైంది. బిగ్ బాస్ లో ఉన్నపుడు తనీష్ తో క్లోజ్ గా ఉండడంతో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఆ తరువాతి సీజన్స్ లో షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్ అయ్యాక వీరిద్దరి ప్రేమ బయటపడింది. అయితే ఏ బిగ్ బాస్ వలన వీరి ప్రేమ బయటపడిందో అదే బిగ్ బాస్ లో సిరితో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండడంతో బ్రేకప్ కూడా అయింది. అప్పటి నుంచి అటు దీప్తి-ఇటు షన్ను ఇద్దరూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు.
OTT Movies : సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 32 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి..
అయితే తాజాగా షన్ను బ్రదర్ కోసం వెళ్లిన పోలీసులకు మనోడు గంజాయి కొడుతూ దొరకడంతో అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ కూడా వచ్చింది. ఆ సంగతి అలా ఉండగా తాజాగా దీప్తి సునైనా తన ఇంస్టాగ్రమ్ వేదికగా అభిమానులతో ఒక ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. ఈ క్రమంలో అనేక ప్రశ్నలు ఆమెను అడిగారు అభిమానులు. అందులో ఒక అభిమాని షన్ను ఉదంతాన్ని గుర్తు చేసేలా మీరు భలే ముందుగానే బరువు దించేసుకుని టెన్షన్ ఫ్రీ అయ్యారు కదా అని ప్రశ్నించాడు. అయితే ఆమెకు ఎలా అర్ధం అయిందో తెలియదు కానీ ఆమె మాత్రం నాకున్న టెన్షన్స్ నాకున్నాయి, కానీ నేనెప్పుడూ దాన్ని బయటకు చూపించుకోను కదా అంటూ కామెంట్ చేసింది. ఇక అంతేకాదు అభిమానులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా ఆమె తెలివిగా, వెటకారంగా సమాధానాలు ఇచ్చింది.