ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ... తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు.
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.
వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు ఆదేశాల తోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు స్కిల్ తో చేసిన స్కామ్ లు పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా? అంటూ మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. వాచ్ లేని చంద్రబాబు కోట్ల రూపాయలతో లాయర్లను ఎలా పెట్టుకున్నాడు అంటూ ఆయన అడిగారు.