Botsa Satyanarayana: పవన్.. నా వద్దకు వస్తే ట్యూషన్ చెబుతా: బొత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్‌వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.
‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి అక్టోబర్ 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తాం. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
Also Read: IND vs NZ: టాస్ గెలిచిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి! తుది జట్లు ఇవే
‘నవరత్నాల్లో భాగంగానే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. మద్యం ధరలు పెంచితే.. ప్రతిపక్షాలకు ఉలుకెందుకు?. డబ్బు మదంతో ఉన్న వారే మద్యం జోలికి వెళ్తారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుంది. ఇక నూతన విద్యా విధానంపై పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. బైజూస్ కంటెంట్ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఏ ఖర్చు చేయలేదు. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా.. కుంభకోణాలు అని పవన్ అంటున్నారు. పవన్‌కు తెలియకపోతే నా వద్దకు వస్తే ట్యూషన్ చెబుతా’ అని మంత్రి బొత్స విమర్శించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?