నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్‌వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ…