Writer Cum Actor Thotapalli madhu Releases a Video saying Sorry: రచయితగా కొన్ని సినిమాలుకు పనిచేసే తర్వాత నటుడిగా మారిన తోటపల్లి మధు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో నటుడిగా మెరిసిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన సినీ పరిశ్రమ మీద సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలుగుతున్న, వెలిగిన కొంత మంది మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు స్టార్ డైరెక్టర్, తనకు అవకాశం ఇచ్చి నటుడిని చేసిన కోడి రామకృష్ణ మీద కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మిగతా వాళ్ళందరూ సైలెంట్ గానే ఉన్నా, కోడి రామకృష్ణ శిష్యులుగా ఉన్న చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేయడమే గాక తోటపల్లి మధుని హెచ్చరించారు కూడా. అందులో ఒకరు దర్శకుడు, నటుడిగా తర్వాతి కాలంలో మారిన దేవి ప్రసాద్.
ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ తోటపల్లి మధు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల నేను ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మా గురువుగారు కోడి రామకృష్ణ గారి గురించి నేను మాట్లాడిన మాటలు గురించి ఆయన శిష్యులు చాలా బాధపడినట్లు నా దృష్టికి వచ్చింది. నన్ను సార్ దయచేసి మీ రియాక్షన్ ఇవ్వకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ అని అడిగారు. అందుకే నేను నా ఇంటర్వ్యూ ఎవరి మనోభావాలు అయినా సరే బాధపెట్టి ఉంటే వారందరికీ భేషరతుగా క్షమాపణ చెబుతూ ప్రతి ఒక్కరికి కోడి రామకృష్ణ గారి శిష్యులు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలతో క్షమించమని కోరుకుంటున్నాను అంటూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఆయన దిగివచ్చి క్షమాపణలు చెప్పటం మంచి పద్ధతి అని పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.