Botsa Satyanarayana: తల్లిదండ్రులు అధైర్యపడొద్దు.. 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే హెల్ లైన్ ఏర్పాటు చేశామని.. ఎవ్వరున్నా తమకు సమాచారం ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్యార్థులను అందరినీ వెనక్కి తీసుకొస్తామని.. తల్లిదండ్రులు అధైర్యపడొద్దని మంత్రి చెప్పారు. తొలుత 150 మందిని తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయడం వల్ల ఆలస్యం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.
Read Also: Alluri Sitarama Raju: అల్లూరి సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవాలి
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
వర్షాల కారణంగా పంట నష్టం పెద్దగా ఏమీ లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పార్వతీపురంలో అరటి పంటకు కాస్త నష్టం జరిగిందన్నారు. మొక్కజొన్న రైతులు అక్కడక్కడా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారులు క్షేత్ర స్థాయిలో అంచనాలు వేస్తున్నారని మంత్రి తెలిపారు. చంద్రబాబు రైతులను పట్టించకోవడం లేదని చెబుతున్నారని.. ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా చూసుకుంటోందన్నారు. రైతుల ఆవేదన సీఎంవో దృష్టికి వచ్చిన వెంటనే సీఎం స్పందించారని.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. అలాగే ప్రత్యేక అధికారులు జిల్లాలకు వచ్చి పరిశీలిస్తున్నారని మంత్రి చెప్పారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!