సీఎం జగన్ మొదటి నుంచి విజన్ ముందుకు వెళ్లే నాయకుడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విశాఖ సమ్మిట్‌తో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని చెప్పారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవాళ్లు లేరంటూ ప్రచారం చేసేవారికి చెంపపెట్టులా విశాఖ సమ్మిట్ నిర్వహించి చూపించారని తెలిపారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను క్యాపిటల్‌గా ఎంచుకున్నారని వివరించారు. సీఎం జగన్ ఓ విజన్‌తో ముందుకు వెళ్లే నాయకుడన్నారు మంత్రి బాలినేని. ఆంధ్రప్రదేశ్‌లో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్‌ను విజయవంతం చేశారన్నారు మంత్రి బాలినేని.
Also Read : Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రం లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. విశాఖ ఇన్వెస్టర్స్ సదస్సుపై అవాక్కులు పేలుతున్న వారు.. గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి బాలినేని. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే విశాఖపట్నంను రాజధానిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని మరింత వేగంగా డెవలప్ చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతం అభివృద్ధి చేయాలంటే.. లక్షల కోట్ల రూపాయిలు కావాలన్నారు మంత్రి బాలినేని. రాజధాని విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని చెప్పారు మంత్రి బాలినేని.
Also Read : Aadi Srinivas : చేతకాని చెన్నమనేని తీరుతో వేములవాడ వెనుకబడింది