Inter Student Heart Attack:అసలు కుర్రాళ్లకు ఏమవుతుంది.. గత కొన్ని రోజులుగా కుర్రాళ్ళు.. గుండెపోటుతో పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. జిమ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, బ్యాడ్మింటన్ ఆడుతూ, టీవీ చూస్తూ.. ఇలా రకరకాల సందర్భాల్లో యువకులు గుండెపోటుకు గురి అవుతున్నారు. చిన్న వయస్సు.. జీవితాన్ని కూడా సరిగా చూసి ఉండరు. అలాంటివారికి గుండెపోటు రావడం ఏంటి..? గత కొంత కాలంగా ఈ వరుస గుండెపోట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పాతికేళ్ళు.. లేదా 30 ఏళ్ల లోపు యువకులే ఈ గుండెపోట్ల బారిన పడడం విషాదకరం. ఇక తాజాగా మరో యువకుడు గుండెపోటుతో మరణించడం సంచలనంగా మారింది. ఈసారి పాతికేళ్ళు కూడా కాదు కేవలం 18 ఏళ్ల యువకుడు గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.
Viral: సాయం చిన్నదైన ఆదర్శం గొప్పది.. ఆచరించాలంటే మనసుండాలి
ఖమ్మం జిల్లా జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపెళ్లికి చెందిన మరీదు రాకేష్.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక ఈరోజు ఆదివారం కావడంతో స్నేహితులతో ఇంటి ఆవరణలో మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అయితే మధ్యలోనే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతడికి గుండెపోటు వచ్చిందని, కాపాడేలోపే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలోనే కాదు ఆ గ్రామంలోనే విషాద ఛాయలు అలముకున్నాయి.