మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని స్పష్టం చేశారు.
READ MORE: Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు తరలింపు.. కేసు గురించి ఎస్పీ ఏమన్నారంటే?
ఇదే సమయంలో పోలీస్ ఉద్యోగం చేసి ఎంపీగా పనిచేసిన ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడని మంత్రి విమర్శించారు. ఇటీవలి సంఘటనల్లో కనిపించిన విధంగా కొంతమంది శాంతిభద్రతలకే అవమాన తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలీసుల బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖలో ఎంతోమంది మహిళలు ఉన్నారని, అటువంటి వ్యాఖ్యలు వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఉన్నవాళ్లను కాపాడుకోవడానికి జగన్ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ప్రస్తుతం రాజకీయంగా చాలా నాసిరక స్థితిలో ఉన్నాడని, సింగిల్ డిజిట్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.
READ MORE: Andhra Pradesh Intermediate Second Year Results 2025