Tadipatri: గత కొన్ని రోజులుగా తాడిపత్రి నగరం రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్…
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని…
CM Revanth Reddy : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా…
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది.. వరసగా కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది.. ఓటమిలో రికార్డు సృష్టిస్తుందని ఆరోపించారు.
మాజీ ఉపముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలతో స్టేషన్ ఘనపూర్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. 13 నెలల్లో నియోజకవర్గానికి ఏం చేశావని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రూ.1000 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కడియం కౌంటర్ ఇచ్చారు.
Elections In AP: ఆంధ్రప్రదేశ్‌లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. Also Read: Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్.. తిరుపతి…
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
Balmuri Venkat : బీఆర్‌ఎస్ కి చెందిన ఓ ఆంబోతు ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ ఎమ్మె్ల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. కొకైన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరు.? పార్టీలో ఏం జరిగింది అనేది పక్కదారి పట్టిస్తున్నారని, 10 యేళ్ల నుండి కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడుతుంటారు కాబట్టి.. ఆయనకు కూడా అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. విజయ్ మద్దూరు చానా దగ్గర వ్యక్తులు అని కేటీఆర్ అంటున్నాడని, నీ సన్నిహితులు కొకైన్ తీసుకుంటే దాని…