Minister Bala Veeranjaneya: మహిళల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇదే ఉదాహరణ..
- ఆడపడుచులను గౌరవించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది
- కిరణ్ చేసిన కామెంట్స్ ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది
- కిరణ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేశారు
- పైశాచికంగా ఆనందపడే పద్ధతి లేదు
- మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని స్పష్టం చేశారు.
READ MORE: Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు తరలింపు.. కేసు గురించి ఎస్పీ ఏమన్నారంటే?
Also Read
ఇదే సమయంలో పోలీస్ ఉద్యోగం చేసి ఎంపీగా పనిచేసిన ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడని మంత్రి విమర్శించారు. ఇటీవలి సంఘటనల్లో కనిపించిన విధంగా కొంతమంది శాంతిభద్రతలకే అవమాన తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పోలీసుల బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖలో ఎంతోమంది మహిళలు ఉన్నారని, అటువంటి వ్యాఖ్యలు వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ఉన్నాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఉన్నవాళ్లను కాపాడుకోవడానికి జగన్ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ప్రస్తుతం రాజకీయంగా చాలా నాసిరక స్థితిలో ఉన్నాడని, సింగిల్ డిజిట్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు.
READ MORE: Andhra Pradesh Intermediate Second Year Results 2025
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!