Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 2025 ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశామని.. అందులో ఇప్పటివరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని ఆయన తాజాగా విలేకర్ల సమావేశంలో అన్నారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని ఆయన ఈ సందర్బంగా తెలియచేశారు.
12,140mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల డిస్‌ప్లేతో రాబోతున్న OnePlus Pad 3.. ధర, ఫీచర్లు ఇలా!
కేంద్రం ఇప్పటి వరకు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, 1.30 లక్షల మెట్రిక్ టన్నులు చేరాయని.. మరో 0.47 లక్షల మెట్రిక్ టన్నులు త్వరలో రాబోతున్నాయని మంత్రి తెలిపారు. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా.. అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయని.. మిగిలిన 0.90 లక్షల మెట్రిక్ టన్నులు గంగవరం, కాకినాడ, విశాఖపట్నం, ఒరిస్సా పోర్టుల ద్వారా త్వరలో చేరనున్నాయని ఆయన తెలిపారు.
Realme: ఇక పవర్ బ్యాంక్స్ అవసరం లేదు భయ్యా.. త్వరలో కొత్త 15,000mAh బ్యాటరీ!
రైతులకు ఎరువులు పారదర్శకంగా, సమయానికి అందించేందుకు iFMS ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని.. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు. మధ్యవర్తులు అధిక ధరలకు అమ్మే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. నల్లబియ్యం, అరటి, చెరకు వంటి ప్రత్యేక పంటలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా పర్యవేక్షణ జరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.