టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారాయణస్వామి బుద్ధి, జ్ఞానం లేకుండా మతిలేని వాడిలా మాట్లాడాడు అని మాజీ మంత్రి నన్నపనేని రాజ కుమారి విమర్శలు చేశారు. ఆయనతో ఎవరు మాట్లాడించారో ప్రజలకు తెలుసు.. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలను ఉద్దేశించి అనరాని మాటలనేవారు అసలు మనుషులేనా అన్న సందేహం కలుగుతోంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ములాఖత్ అయ్యారు. 40 నిమిషాల పాటు ములాఖత్ సాగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరీలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్ తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడు అంటూ ఆయన విమర్శించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.