Akasa Air Lines: ఆకాశ ఎయిర్ లైన్స్ మూసీవేత.. సీఈఓ ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akasa Air Lines Shutdown Rumors: బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని మూసేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెలలోనే ఏడాది పూర్తి చేసుకున్న ఎయిర్ లైన్స్ మొదటి వార్షికోత్సవం సంద్భంగా చాలా తక్కువ ధరకే టికెట్లు అందించింది. అయితే చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బును వాపస్ చేశారు. ఇలా విమానాలు చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడానికి కారణం పైలెట్లు సడెన్ గా రాజీనామా చేసి వెళ్లిపోవడమే అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు పైలట్లు అకస్మాత్తుగా రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. అయితే వీరు కాంట్రాక్ట్ పిరియడ్ చేయకుండా సడెన్ గా వేరే కంపెనీలో చేరిపోయారు. దీని కారణంగా అనేక విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. జూనియర్ ట్రైనీ పైలెట్లు ఇలా చేసినట్లు తెలుస్తుంది.
Also Read: Tamilnaadu: తమిళనాడులో కలకలం.. నెల రోజుల్లో తొమ్మిది పెద్ద పులులు మృతి
Also Read
- MS Dhoni: "డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా".. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
- Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
- Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
- Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ఈ నేపథ్యంలో కంపెనీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే తమకు పరిహారం చెల్లించాలని సడెన్ గా వెళ్లిపోయిన 43 మంది పైలెట్లపై కూడా ఆకాశ ఎయిర్ లైన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆకాశ ఎయిర్ లైన్స్ ను మూసివేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. వీటిపై స్పందించిన సంస్థ సీఈఓ వినయ్ దూబే పైలట్ల ఆకస్మిక రాజీనామాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే ఎయిర్ లైన్స్ మూసివేస్తున్నారన్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి పుకార్ల వల్ల తమ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని అలాంటిది ఏం లేదంటూ వారికి మెయిల్స్ కూడా పంపినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు కార్యకలాపాలను తగ్గించుకున్నామని వెల్లడించిన ఆయన ఈ మేరకు మార్కెట్లో వాటాను స్వచ్ఛందంగా వదులుకున్నామని చెప్పుకొచ్చారు. సంస్థపై ప్రయాణీకులకు నమ్మకం కలిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినయ్ దూబే పేర్కొ్న్నారు. కంపెనీ కచ్చితంగా సక్సెస్ అవుతుందని తాము గట్టిగా నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. తమ విధానాల కారణంగా సంస్థ ఆర్థికంగా బలంగా, భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా అమలు అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక గతేడాది ప్రారంభమైన ఆకాశ ఎయిర్ లైన్స్ ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ వంటి 16 నగరాలను కలుపుతూ 35 ప్రత్యేక మార్గాల్లో ఆపరేట్ చేస్తోంది.
Akasa CEO Vinay Dube tells staff :
– @AkasaAir is not shutting down
– Curtailed flights to adjust for pilot exits, who are being sued by airline
– Have got international flying permission from @MoCA_GoI. Will add planes
– On track to announce aircraft order in 2023
— Tarun Shukla (@shukla_tarun) September 20, 2023
తాజావార్తలు
-
MS Dhoni: “డాక్టర్లపైనే నమ్మకం ఉంచా.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా”.. రిటైర్మెంట్పై ధోనీ సంచలన ప్రకటన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!