Mini Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సిద్దిపేట జిల్లాలో నిర్వహించే మినీ మేడారం జాతరలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో సమ్మక్క ఆలయాన్ని ప్రతిష్ఠించారు. మేడారం తరహాలో ఈ జాతర కూడా 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. మొదటిరోజు సారలమ్మ, రెండోరోజు సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రం అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ వేడుకల్లో భాగంగా గురు, శుక్రవారాల్లో రాత్రి వేళల్లో కథల కార్యక్రమం నిర్వహిస్తారు.
Read also: CM Revanth Reddy: మిషన్ భగీరథపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
అక్కెనపల్లి మినీ మేడారం జాతర..
నేటి నుంచి 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేయడంతో అక్కెనపల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్కను గద్దెకు తీసుకురానున్నారు. ఈ జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు కానుకలు చెల్లించి పూజలు నిర్వహించనున్నారు. శనివారం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా రాత్రి కథ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read also: IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్!
కథనం ఇలా..
నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివారులోని పులిగుండ్ల సమీపంలో ఓ గొర్రెల కాపరి 40 ఏళ్ల కిందటే మేకలను మేపుతుండగా పెద్ద బట్టతల ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులంతా తండోపతండాలుగా అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు కొద్దిరోజుల ముందు ఈ ప్రాంతంలో పసుపు, కుంకుమ బొట్లు దర్శనమిచ్చాయని పూనకం వచ్చిన ఓ మహిళ తెలిపారు. ఆమె మాటలతో గ్రామస్తులు నమ్మారు. సమ్మక్క తల్లి పులిపై స్వారీ చేస్తుందని, అందుకే గ్రామంలోని పులి గుట్టల వద్ద పసుపు రంగులో దర్శనమిస్తుందని గ్రామస్తుల నమ్మకం. దీంతో గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ సమయంలో పులిగుండ్ల సమీపంలో తలో 14 ఎకరాల భూమిని సేకరించి 1984లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి కోడలు లక్ష్మి, పగిద్దరాజు (నాగుపాము) విగ్రహాలను ప్రతిష్ఠించారు.అప్పటి నుంచి ప్రతి రోజు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మేడారంలో రెండేళ్లు సమ్మక్క, సారలమ్మలు ఉసిరికాయలు వేసి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
Virat Kohli-Akay: విరాట్ కోహ్లీ, అకాయ్ ఫోటోలు చూశారా?.. నాన్న మ్యాచ్ ఆడుతుంటే..!