Virat Kohli-Akay: విరాట్ కోహ్లీ, అకాయ్ ఫోటోలు చూశారా?.. నాన్న మ్యాచ్ ఆడుతుంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Son Akaay AI Images Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మంగళవారం (ఫిబ్రవరి 20) విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడుకి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇక తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి చేశాడు. కూతురు పుట్టినపుడు కూడా ఫొటోలు తీయొద్దని మీడియాను కోరిన విషయం తెలిసిందే.
వామిక పుట్టినప్పటి నుంచి ఆమె మీడియా కంట పడకండా విరాట్ కోహ్లీ జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. వెనకాల నుంచి, సైడ్ యాంగిల్స్ ఫొటోస్ బయటకు వచ్చినా.. ఇప్పటివరకు వామిక పూర్తి ఫొటో మాత్రం ఒక్కటి కూడా బయటకు రాలేదు. అంటే విరుష్క దంపతులు ఎంత కేర్ తీసుకుంటున్నారో యిట్టె అర్ధమవుతోంది. ఆకాయ్ విషయంలోనూ ఈ స్టార్ కపుల్ అదే జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఆకాయ్ పుట్టి వారం అవుతున్నా.. ఎక్కడ కూడా ఫోటోను షేర్ చేయలేదు. దాంతో జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి ఫాన్స్ తహతహలడుతున్నారు.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
అయితే కొంత మంది ఫ్యాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్ భారత జెర్సీలో ఉన్నట్లు, అనుష్క, విరాట్‌తో కలిసి అకాయ్ ఆడుకుంటునట్లు, కోహ్లీ మ్యాచ్ ఆడుతుంటే అకాయ్ టీవీ చూస్తున్నట్లు, కోహ్లీ ఫామిలీ ఫొటోను అభిమానులు ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయిన విరాట్.. ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు సమాచారం.
AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna
— kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!