పోషక విలువలు కలిగిన గుడ్లను రోజు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇటీవల పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గుడ్ల ధరలు మండిపోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇతర దేశాలపై సుంకాల విధించిన విషయం తెలిసిందే. భారత్ తో సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించుకున్న ట్రంప్‌కు గుడ్లు తలనొప్పిని పెంచాయి. ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకునే అమెరికా యంత్రాంగం, దేశంలో పెరుగుతున్న గుడ్ల ధరల పట్ల ఆందోళన చెందుతోంది.
Also Read:MI vs KKR: హోమ్ గ్రౌండ్ లో రెచ్చిపోయిన ముంబై బౌలర్లు.. కేకేఆర్ 116 ఆలౌట్
అమెరికాలో గుడ్ల ధర (Eggs Price in US) ఆకాశాన్నంటుతోంది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి ప్రజలు గుడ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొన్ని నగరాల్లో ఒక డజను గుడ్ల ధర $10 (సుమారు రూ. 870)కి చేరుకుంది. అమెరికాలో గుడ్ల ధరలు అకస్మాత్తుగా పెరగడానికి గల కారణాలు చూసినట్లైతే.. బర్డ్ ఫ్లూ H5N1 లేదా ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా మహమ్మారి వ్యాప్తి కారణంగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు అమెరికాలో 15 కోట్లకు పైగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1.9 కోట్ల కోళ్లు చంపబడ్డాయి. ఫలితంగా గుడ్ల సరఫరా తగ్గింది.
Also Read:Air cooler: బంపరాఫర్.. రూ. 5 వేలు విలువ చేసే కూలర్ రూ. 1300కే.. త్వరపడండి
ప్రస్తుతం అమెరికా యూరప్‌లోని అనేక దేశాల నుంచి గుడ్లు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. టర్కీ, దక్షిణ కొరియా నుంచి గుడ్లు కొనుగోలు చేయాలనే అమెరికా భావిస్తోంది. ట్రంప్ అనేక దేశాలపై సుంకాలు, పరస్పర సుంకాలను ప్రకటించారు. దీని కారణంగా అమెరికా గుడ్లు కొనడం అంత సులభం కాదు. అదే సమయంలో, ఇతర దేశాల నుంచి అమెరికాకు గుడ్లను తీసుకురావడం సవాల్ తో కూడుకున్నది. గుడ్లను దిగుమతి చేసుకోవాలనే అమెరికా ప్రతిపాదనను పోలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ తిరస్కరించాయి.