Telangana Elections 2023: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మహాత్మ గాంధీ బస్సు స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. వివరాలలోకి వెళ్తే.. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఊర్లకు వెళ్లే ప్రజలంతా ఎంజీబీఎస్ కు చేరుకుంటున్నారు. దీనితో ఎంజీబీఎస్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్సు స్టేషన్ కి ప్రయాణికుకులు వస్తూ ఉండడంతో ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ మొత్తం రద్దీగా మారింది. సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
Read also:Nagarjuna sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్..
కాగా తెలంగాణాలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ కోరింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. తెలంగాం లోని మొత్తం 33 జిల్లాలోని 119 అసెంబ్లీ నియోజకర్గాలలో ఎన్నకల పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసుల నిఘా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా లక్షమంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.