Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Addiction: ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి వివాదంలో చిక్కుకుంది. మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ (Instagram) టీనేజర్లను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాకు బానిసలుగా మార్చే విధంగా రూపొందించబడిందంటూ అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మెటాతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీచర్లు టీనేజర్లు ఎక్కువసేపు యాప్‌లో గడిపేలా రూపొందించబడ్డాయి. దీని వల్ల యువతలో సోషల్ మీడియా వ్యసనం పెరగడమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రతరమవుతున్నాయని ఆరోపించింది. ఈ అంశంపై వచ్చే వారంలో కోర్టులో కీలక విచారణ జరిగే అవకాశం ఉంది..
పిటిషన్లో మరో కీలక అంశం కూడా ప్రస్తావించారు. టీనేజర్లపై ఇన్స్టాగ్రామ్ ప్రభావం గురించి మెటా సంస్థ అంతర్గతంగా పరిశోధనలు నిర్వహించిందని, ఆ నివేదికల్లో యాప్ వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించినప్పటికీ వాటిని బహిరంగంగా వెల్లడించలేదని టెన్నెస్సీ అటార్నీ జనరల్ జోనాథన్ స్క్రమెట్టి కార్యాలయం ఆరోపించింది. అంతేకాదు, ఈ పరిశోధనల వివరాలను పలువురు ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్ దృష్టికి తీసుకెళ్లినా, హానిని తగ్గించే చర్యలకు తగిన నిధులు కేటాయించలేదని కూడా దావాలో పేర్కొన్నారు. అలాగే ప్లాట్‌ఫారమ్‌లోని హానికరమైన కంటెంట్ పరిమాణంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని ఆరోపించారు.
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
ఈ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆటోప్లే, రీల్స్, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి వినియోగదారులు, ముఖ్యంగా టీనేజర్లు, ఎక్కువ సమయం యాప్‌లోనే గడిపేలా ప్రోత్సహిస్తున్నాయని టెన్నెస్సీ ప్రభుత్వం వాదిస్తోంది. అందువల్ల మెటాపై జరిమానా విధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవసరమైన మార్పులు చేయాలని కోర్టును కోరింది. అయితే ఈ ఆరోపణలను మెటా ఖండించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే కంటెంట్‌లో ఎక్కువ భాగం వినియోగదారులే పోస్ట్ చేస్తారని, మూడో వ్యక్తులు పోస్ట్ చేసిన కంటెంట్‌కు సంబంధించి అమెరికా కమ్యూనికేషన్స్ డీసెన్సీ యాక్ట్‌లోని సెక్షన్ 230 ప్రకారం తమకు చట్టపరమైన రక్షణ ఉందని సంస్థ వాదిస్తోంది. ఈ కేసు ఫలితం సోషల్ మీడియా సంస్థలపై భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావడానికి దారితీసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీనేజర్ల ఆన్లైన్ భద్రత, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ కేసు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది..
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!