ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ బాగా పాపులర్ అయ్యింది. ఇందులో రీల్స్ చేస్తూ.. లైక్స్, ఫాలోవర్స్ కోసం ఆరాటపడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీని మోజులో పడి నలిగి పోతున్నారు. గంటలతరబడి రోజుల తరబడి రీల్స్ చూస్తూ అలాగే ఒకదానితరువాత మరొకటి స్క్రోల్ చేస్తూ కూర్చుంటున్నారు.
Modern Woman: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వల్ల లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎక్కడైన చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది టీవీలో వచ్చేంతవరకు ప్రపంచానికి తెలియదు. ఇంటర్నెట్ వాడకం విరివిగా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది.