PBKS vs RR: రాజస్థాన్ రాయల్స్ మళ్లీ విజయాల బాట పట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శనివారం నాడు మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్, ఐదు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ ఐదు మ్యాచ్ లలో కేవలం ఒకదానిలో మాత్రమే ఓడి పాయింట్స్ టేబుల్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది.
Also Read: Astrology: ఏప్రిల్ 13, శనివారం దినఫలాలు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇక ఈ రెండు జట్లు పంజాబ్, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 26 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ వాటిలో 11 మ్యాచ్ లు, రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్ లు గెలిచింది. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఇప్పటివరకు పంజాబ్ అత్యధికంగా 223 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 226. ఇక వీరిద్దరి మధ్య గత ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ రెండు విజయాలు సాధించింది.
ఇక మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలోని మొహాలీ పిచ్ భారతదేశపు అత్యంత వేగవంతమైన వాటిలో ఒకటి. పిచ్ పై పేసర్లకు అదనపు బౌన్స్ అందిస్తుంది. ముఖ్యంగా కొత్త బంతితో బ్యాటర్లు ఇక్కడ పడాల్సి ఉంటుంది. ఇక రాత్రి మంచు ఆటను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ సాధారణంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు. ఇక నేటి మ్యాచ్ లో ఆటగాళ్ల విషయానికి వస్తే..
Also Read: Sabdham: వామ్మో.. వణికిస్తున్న శబ్దం టీజర్
పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ (c), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, సికందర్ రజా, జితేష్ శర్మ (WK), అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్ లు
ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఉండవచ్చు. అదేవిధంగా..
రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా ఇంపాక్ట్ ప్లేయర్ గా కుల్దీప్ సేన్ ఉండొచ్చు అనే అంచనా.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..