టాలివుడ్ హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాద తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి.. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.. మహానుభావుడు చిత్రంతో మరో హిట్ కొట్టింది. దీంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. తర్వాత ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయితే ఎఫ్ 2 చిత్రంతో కమ్ బ్యాక్ అయ్యింది.. ఇక సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన సినిమా అప్డేట్స్ తో పాటుగా లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా డిఫరెంట్ లుక్ లో ఉన్న వైన్ షాప్ లో ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. అవి వైరల్ అవ్వడంతో పాటుగా రకరకాల కామెంట్స్ ను కూడా అందుకుంటున్నాయి..
ఓ క్లాసీ వైన్ షాప్‌లో వైన్ బాటిల్స్ వద్ద నిల్చొని ఫోటో షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో అవి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైన్ షాప్‌ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఈ అమ్మడి పోజులుండటం విశేషం..ఇందులో మెహరీన్ ధరించిన డ్రెస్ సైతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె పొట్టి దుస్తులు ధరించింది. మోకాళ్లపైకున్న గౌనులో క్రేజీ పోజులిచ్చింది.. ఆ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..