కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది.అప్పటి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి బాగా అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు మరియు డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు అయితే మంచి ఆదరణ లభిస్తుంది.అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైనట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది .
చాలాకాలంగా చిరు ఓటీటీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.తన ఇమేజ్ కి సూట్ అయ్యే కంటెంట్ దొరికితే ఖచ్చితంగా వెబ్ సిరీస్ చేస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చిరంజీవి..దీనితో తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ ఒప్పందం చేసుకున్నట్లు ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’.ఈ మూవీ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది. ఇప్పటికే సినిమా కోసం చిరంజీవి భారీ వర్కౌట్స్ చేసిన వీడియో మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజా షెడ్యూల్ లో చిరంజీవితో పాటు త్రిష కూడా జాయిన్ అయ్యింది. వీళ్ళిద్దరిపై మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సుమారు 100 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు సమాచారం.