Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమా టైటిల్.. విశ్వంభర అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక సంక్రాంతి రోజున ఆ వార్తలను నిజం చేస్తూ విశ్వంభర టైటిల్ ను రివీల్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
గ్లింప్స్ లో ఒక మాయ పెట్టె.. స్వర్గపు అంచులను తాకుతూ వెళ్తున్నట్లు చూపించారు. అక్కడ మాయా పెట్టెను లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది కాల రంధ్రం గుండా వెళుతుంది.. చివర్లో ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు మరియు అడ్డంకులు తర్వాత, మాయా వస్తువు చివరకు భూమికి చేరుకుంటుంది, ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో ప్రతీకాత్మకంగా చూపబడింది. ఒక బిలం భూమిపైకి దూసుకుపోతున్నప్పుడు కనిపిస్తుంది, అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగలేదు. ఇక చివరగా అది ఓపెన్ అవ్వడంతోనే విశ్వంభర టైటిల్ పడడం చూపించారు. మెగా మాస్ బియాండ్ ది యూనివర్స్ అనేది మన ఊహకు అందనిది అని మేకర్స్ రాసుకొచ్చారు. మాయా పెట్టె ప్రయాణమే మనం సినిమాలో చూడబోతున్నట్లు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ టాప్ నాచ్‌గా ఉంది. మరీ ముఖ్యంగా విశ్వంభర అనే టైటిల్ చాలా ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణీ మ్యూజి మరో ఎత్తు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.