Mega156: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో భారీ హిట్ ను అందుకున్న వశిష్ఠ.. తన రెండో సినిమానే చిరుతో చేయనున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Mega156: గతేడాది భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఇక ఆ పరాజయం నుంచి బయటపడడానికి ఈసారి పక్కా ప్లాన్ వేశాడు. బింబిసార లాంటి హిట్ అందుకున్నడైరెక్టర్ వశిష్ఠ తో మెగా 156 ను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ కాంబో అనుకున్నారో అప్పటినుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.