Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- ఆపరేషన్ థియేటర్లో నర్సు మర్డర్..
- విషాన్ని ఇంజెక్ట్ చేసి హత్య చేసిన ప్రియుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nurse Murder Case: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నర్సు అనుమానాస్పదంగా మరణించింది. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఇది హత్య అని తేలింది. ప్రియుడే హత్య చేసినట్లు వెల్లడైంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండటంతో పథకం ప్రకారం ప్రియుడు హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆస్పత్రి ఉద్యోగితో కలిసి ఆపరేషన్ థియేటర్లో విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఒక నకిలీ సూసైడ్ నోట్ రాసి మృతదేహం వద్ద ఉంచారు. ఈ కేసులో ప్రియుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఫఫుండాకు చెందిన 25 ఏళ్ల నేహా, లోహియా నగర్‌లోని ఎంసీసీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె శనివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆపరేషన్ రూంలో అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యులు ఆమెను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు ఆమె మృతదేహం వద్ద సల్ఫర్ మాత్రలు, ఆమె అత్తమామలపై ఆరోపణలు చేస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తి చేశారు. అత్తమామలతో ఎలాంటి గొడవ లేదని చెప్పారు.
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డుల్ని పరిశీలించారు. దీంతో ఆస్పత్రి ఉద్యోగి సురేష్, నేహా గత 7-8 ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్‌లో నేహా, సురేష్, మరో ఉద్యోగి ఫర్హాన్‌లతో కలిసి ఆపరేషన్ థియేటర్లోకి ప్రవేశించడం కనిపించింది. విచారణలో తనకు పెళ్లయిందని, ఐదేళ్ల కొడుకు ఉన్నాడని సురేష్ నేహాతో చెప్పాడు. అయినా కూడా నేహ తనపై పెళ్లి కోసం ఒత్తిడి తెస్తూనే ఉందని అందుకే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నేహా నీరసంగా ఉందని చెప్పడంతో, శక్తి కోసం సెలైన్ ఎక్కిస్తామని చెప్పి అందులో విషం కలిపినట్లు తేలింది. ఏడాది క్రితం నేహ భర్త రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. నేహ తన కుటుంబం, పిల్లల్ని పోషించుకోవడానికి నర్సుగా పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్‌లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!