Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geetanjali Angmo: లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, ఆయన భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, ఈ కేసును అత్యవసరంగా సోమవారం విచారణకు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను కోరారు.
ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారంటూ డాక్టర్ గీతాంజలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని, అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసు అధికారులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారని ఆమె ఆరోపించారు. ఆసుపత్రిలోని పరిస్థితులు, పోలీసుల వ్యవహారం ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య నివేదికల్లో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు. ఆయన వైద్య రిపోర్ట్ సాధారణంగా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించిందన్న వాదన వాస్తవాలకు విరుద్ధమని ఆమె వెల్లడించారు. అలాగే, ప్రభుత్వానికి నిజంగా ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే సాధారణ వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి నిర్ణయం తీసుకోవాల్సిందని, బలవంతంగా ఆసుపత్రికి తరలించడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రభుత్వం చూపిస్తున్న ఆందోళన కేవలం “బూటకం” మాత్రమేనని ఆమె ఆరోపించారు.
Also Read
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
మరోవైపు, సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టాలని భావించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. వాంగ్‌చుక్ లేకపోయినా ఉద్యమానికి మరింత ప్రజా మద్దతు లభిస్తుందని, ఈ పరిణామాల వల్ల ప్రజల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో, అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!