సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది. రజనీ కెరీర్‌లో 173వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’పై నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం ఎవరికి వరిస్తుందా? అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ శిబి చక్రవర్తికి ఈ అవకాశం దక్కింది. మొదట ఈ సినిమా రేసులో సీనియర్ దర్శకుడు సుందర్.సి పేరు వినిపించినప్పటికీ, కథలో ఉన్న కొత్తదనం మరియు శిబి విజన్ నచ్చడంతో చివరికి ఈ భారీ బాధ్యతను ఆయనకే అప్పగించారు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజికల్‌గా కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇద్దరు అగ్ర నటులు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సంచలనంగా మారింది. అంతే కాదు..
Also Read : The Raja Saab :‘రాజా సాబ్’ సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్!
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ‘ప్రతి హీరోకు ఓ ఫ్యామిలీ ఉంటుంది’ అనే క్యాప్షన్ చూస్తుంటే, ఇందులో ఎమోషన్స్‌తో కూడిన ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఉండబోతుందని స్పష్టమవుతోంది. రజనీకాంత్ స్టైల్, శిబి చక్రవర్తి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విజువల్ వండర్‌ను 2027 సంక్రాంతి కానుకగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో కి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ఒక సినిమా కోసం పని చేస్తుండడంతో ఇటు తమిళంతో పాటు అటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.