విశాఖపట్నంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ ఎఫెక్ట్ తో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై నిషేధం విధించే ప్రమాదం ఏర్పడింది అని పేర్కొన్నారు.